తెలంగాణ ఎంసెట్ షెడ్యుల్ విడుదల

353
ts-eamcet-
- Advertisement -

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. ఈనెల 19న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

రూ.500ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వరకు అవకాశం ఉండగా, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13వరకు, రూ.5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక మార్చి నుంచి 31 నుంచి ఎప్రిల్ 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మే1 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. మే 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9,11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -