మే 16.. దోస్త్ ఆప్లికేషన్‌ షూర్

57
- Advertisement -

తెలంగాణలోని డిగ్రీ కోర్సులలో ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ మండలి గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మండలి ఛైర్మన్ లింబాద్రి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడుతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్ ప్రక్రియ సాగుతుందన్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 10వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 20 నుంచి జూన్ 11వరకు ఆప్షన్లు ఇవ్వాలని జూన్‌ 16న మొదటి విడుతలో డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రెండవ విడత జూన్ 16 నుంచి 26వరకు ఉంటుందని అన్నారు. 16 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని జూన్ 30న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు.

Also Read: ఢిల్లీ పాలన స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీం

మూడవ విడత కోసం జూలై 1 నుంచి 5 వరకు ఉంటుందని తెలిపారు. 1 నుంచి 6వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉందని జూలై 10 సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. మొదటి విడతలో రూ.200 రిజిస్ట్రేషన్‌ ఛార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపారు. రెండు మూడవ విడతలో మాత్రం రూ. 400 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Also Read: మొక్కలు నాటిన కమెడియన్ కపిల్ శర్మ

- Advertisement -