తెలంగాణలో క్రైమ్ రేట్ 2 శాతం పెరిగిందన్నారు డీజీపీ జితేందర్. 2 తెలంగాణలో కేవలం 2024 లోనే 1,69,477 కేసులు నమోదు అయ్యాయని…43.33 శాతం సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయన్నారు. కేవలం 2024 లోనే 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలిసులు ఆత్యహత్యలు జరుగుతున్నాయి అన్నారు. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు. చాలా చోట్ల వ్యక్తి గత కారణలతోనే ఆత్మహత్య జరుగుతున్నాయి అన్నారు.
డౌరీ మర్డర్ 22, వరకట్న వేధింపు మృతి 126 , మహిళల హత్యలు241, కిడ్నాప్ లు1122, కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము అని..రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవు అన్నారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడమని…అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారు అన్నారు.
48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది..ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేశామన్నారు. 2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు…ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేశాం…రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేశామన్నారు. 77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడిందన్నారు.
Also Read:PSLV C-60:నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 60