తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్‌

167
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయోమెట్రిక్‌ ద్వారా హాజరును నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బయోమెట్రిక్ కు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని కూడా ఆదేశించింది.

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఉన్నత విద్యకు చెల్లించే ఉపకార వేతనాలకు కావల్సిన హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు బయోమెట్రిక్‌ హాజరు ఉపయోగపడుతుందని గతంలో పలు కమిటీలు సూచించిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో పాటుగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పనిచేస్తున్నారు. వారి సెలవులు ఇతరత్రా వివరాలు నమోదుకు సులభంగా ఉంటుందని బయోమెట్రిక్‌ హాజరు ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -