టిఎస్ పిఎస్ సి ద్వారా గ్రూపు-2 పరీక్షల్లో ఎంపికై రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలో నియమితులైన అభ్యర్ధులకు వినూత్న పద్ధతులతో ఉత్తమమైన శిక్షణను అందించటానికి తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ శ్రీమతి నీతూప్రసాద్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్, సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ శశిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాలకనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా వారిని ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దేలా శిక్షణ ఉండాలని సి.యస్ అన్నారు. విధి నిర్వహణలో నిత్యం ఉపయోగపడేలా ఉండాలన్నారు. . ఆసక్తి కలిగేలా, మంచి Impact ఉండేలా శిక్షణ ఉండాలని సి.యస్ ఆకాంక్షించారు.
శిక్షణకు అవసరమైన మాడ్యూల్స్, వసతి, రిసోర్స్ పర్సన్స్ నియామకం, కాలవ్యవధి, క్షేత్ర స్ధాయి పర్యటనలు, ఐటి, వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి GST, VAT ఎకౌంటింగ్, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ కు సంబంధించి ఎక్సైజ్ ఆక్ట్, ఎన్ ఫోర్స్ మెంట్, తెలంగాణకు హరితహారం, CRPC, IPC, రెవెన్యూకు సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూచట్టాలు, సర్వీస్ మ్యాటర్స్ లాంటి అంశాలతో పాటు మోరల్ ఎధిక్స్, కోర్టు కేసులను డీల్ చేయడం వంటి అంశాలు శిక్షణలో అందించాలన్నారు. గ్రూపు-2 లో 259 మంది డిప్యూటి తహశీల్దార్లు, 284 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 156 మంది ఎసిటిఓలు ఎంపికైయ్యారు.