తెలంగాణ సాధించి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్రప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర సీఎస్ శాంతి కుమారిని ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.
ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కొనసాగనున్నారు. దశాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ వ్యవహరించనున్నారు. ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని నలుదిశలా చాటిచెప్పేవిధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 21రోజుల పాటు తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంను తలపించేలా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
Also Read: సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..