తెలంగాణలో కోవిడ్ అదుపులోనే ఉంది- సీఎస్‌

55
cs

మార్చి 1 నుంచి మూడో విడ‌త వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల సీఎస్‌ల‌తో కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా శనివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాల‌ని అన్ని రాష్ట్రాల సీఎస్‌ల‌కు రాజీవ్ గౌబా సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నుండి సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థిని ఆయన రాజీవ్‌ గౌబాకు వివరించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో క‌రోనా అదుపులోనే ఉంద‌ని సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శికి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉంద‌ని పేర్కొన్నారు. 1100 ప్రాంతాల్లో యాంటిజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, కోవిడ్ బాధితుల‌కు వెంట‌నే ఔష‌ధాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే 75శాతం మంది వైద్యారోగ్య సిబ్బందికి టీకాలు అంద‌జేశామ‌న్నారు. మార్చి 1 నుంచి మూడో విడ‌త వ్యాక్సినేష‌న్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.