ఏప్రిల్‌ 14 వరకు కోర్టులు…. లాక్‌డౌన్‌

241
ts court
- Advertisement -

ఏప్రిల్ 14 వరకు తెలంగాణలో కోర్టులకు లాక్ డౌన్ పొడిగిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సహా జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్‌ కోర్టులు, ట్రిబ్యునళ్లు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ.. వీటన్నింటినీ మూసేయాలని ఆదేశించారు.

ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అత్యవసర కేసుల విచారణకు కారణాలు తెలియజేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఈ–మెయిల్‌ పంపాలన్నారు. ఈ–మెయిల్‌ ద్వారా వచ్చే వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ పరిశీలించి అనుమతిస్తే.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టనున్నారు.

న్యాయవాదులుగానీ, కక్షిదారులుగానీ ఎవరూ వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదని, సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. అత్యవసరమైన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండాలని పేర్కొంది.

- Advertisement -