తెలంగాణ వచ్చాకే మేడారంకు ఆదరణ

378
Gutta Sukendar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మేడారం జాతరకు విశేషమైన ఆదరణ పెరిగిందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తమ తమ కుటుంబ సభ్యుల సమేతంగా మేడారం చేరుకొని వనదేవతలు.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు.

ఈసందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో మేడారం జాతర విశిష్టత రెట్టింపయిందని అన్నారు. మేడారంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేసినట్లు తెలిపారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చి, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో జాతరకు భారీ ఎత్తున భక్తుల రాక పెరిగిందని ఆయన తెలిపారు. కనీవినని రీతిలో ఏర్పాట్లు కల్పించడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని మండలి చైర్మన్‌ అన్నారు.

- Advertisement -