రాష్ట్రంలో 24 గంటల్లో 493 కరోనా కేసులు..

181
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,791కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3684 యాక్టివ్ కేసులుండగా 2,99,427 మంది కరోనా నుండి కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,680కు చేరింది. గత 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో 138 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఒక్కరోజే రాష్ట్రంలో 56,464 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -