రాజకీయాల్లో వర్గపోరు మరియు ఆదిపత్య పోరు లకు కేరాఫ్ అడ్రస్ ఏ పార్టీ అంటే టక్కున ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరే చెబుతారు. అంతలా ఈ పార్టీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా టి కాంగ్రెస్ లో ఈ తరహా విభేదాలు ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినది మొదలుకొని సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు. కొన్నిమార్లు రేవంత్ వర్సస్ సీనియర్ నేతల వ్యవహారం అధిష్టానం కూడా పరిష్కరిచలేనంతగా మారిపోయింది. అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విజయం సాధించింది. పార్టీలో ఈ ఆధిపత్య పోరు కూడా తగ్గుతూ వచ్చింది..
తామంతా ఒక్కటేనని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు టీ కాంగ్రెస్ నేతలు. అయితే ఆ విభేదాలు నివురుగప్పిన నిప్పుల ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రేవంత్ రెడ్డి మరియు సీనియర్స్ మద్య ఉన్న విభేదాలు మరోసారి బయట పడ్డాయి. సీట్ల పంపకాల విషయంలో ముమ్మర కసరత్తులు చేస్తున్న టి కాంగ్రెస్.. ఆశావాహుల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఒక ఓ రెండు సీట్ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి మద్య గాంధీభవన్ తీవ్ర వాంగ్వాదం చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read:బీజేపీ ఒంటరి పోరు.. కలిసొస్తుందా?
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి సీట్ల కేటాయింపు విషయంలో ఉత్తమ్ కుమార్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు వినికిడి. తాను హుజూర్ నగర్ నుంచి తన బార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి పోటీ చేయబోతున్నాట్లు ఉత్తమ్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలుపాలని రేవంత్ రెడ్డిని ఉత్తమ్ డిమాండ్ చేయడంతో ససేమిరా అన్నట్లు టాక్. దీంతో మరోసారి సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అయింది. కాగా ఇప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో దిగేందుకు బారిగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఒకే కుటుంబానికి రెండు సీట్లు కేటాయించడం కుదరదని రేవంత్ రెడ్డి చుబుతున్నారట. మరి ఒకవేళ ఉత్తమ్ ఆశించినట్లుగా సీట్ల కేటాయింపు జరగకపోతే ఆయన పార్టీ విడతారా ? అనేది కూడా హాట్ టాపిక్ అయింది.
Also Read:నల్లజామతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?