తెలంగాణలో విద్యుత్ కు సంబంధించి ఎలాంటి చర్చ వచ్చిన 2014 కంటే ముందు 2014 తరువాత అని చెప్పక తప్పదు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నెలకొన్న విద్యుత్ అంతరరాయాలు అంతా ఇంతా కాదు. తీవ్రమైన కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడే దుర్భరమైన పరిస్థితి. కనీసం రెండు గంటలు కూడా కరెంటు అందివ్వలేని అసమర్థ పాలనతో రైతులకు కన్నీల్లే మిగిల్చింది గత రోజుల్లో కాంగ్రెస్ సర్కార్. కానీ 2014 లో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత కాంగ్రెస్ అసమర్థ పాలనకు స్వస్తి చెప్పి రాష్ట్రాన్ని కేంద్ర పెద్దలతో కోట్లాడి తెచ్చిన కేసిఆర్ కు అధికారాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. అప్పటి నుంచి రాష్ట్ర స్థితిగతులే పూర్తిగా మారిపోయాయి. అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలోనూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలుపుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు ముఖ్యమంత్రి కేసిఆర్. గతంలో ఎదుర్కొన్నా తీవ్రమైన కరెంట్ కోతలకు చరమగీతం పలుకుతూ ఎక్కడ లేని విధంగా ఎవరు ఊహించని రీతిలో 24 గంటల ఉచిత కరెంట్ ను అందిస్తూ దేశ పాలకులనే ఆశ్చర్య పరిచారు.
ప్రస్తుతం దేశంలో 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ సర్కారే కావడంతో ప్రత్యర్థి పార్టీలు బురద చల్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వాటన్నిటిని ప్రజలే తిప్పి కొడుతున్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అమలు కావడం లేదని కాంగ్రెస్ నేతలు ఎన్ని విమర్శలు చేసిన.. మీరు అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎన్ని గంటల కరెంట్ వస్తుందని ప్రజలే కాంగ్రెస్ నేతలను ప్రశ్నించే పరిస్థితి. దాంతో కరెంట్ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పై విమర్శలు గుప్పిస్తే.. తిరిగి తామే నష్టపోక తప్పదని గ్రహించిన కాంగ్రెస్ నేతలు.. ఊహకందని రీతిలో కరెంట్ పై హామీలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కరెంట్ విషయంలో మాట్లాడుతూ మెదక్ నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా నిలుస్తున్నాయి. కేసిఆర్ సర్కార్ 24 కరెంట్ ఇస్తోందని చెబుతూ తాము అధికారంలోకి వస్తే రోజుకు 48 గంటల కరెంటు ఇస్తామని అసమర్థ హామీలు ప్రకటించారు. దీంతో 24 గంటలే అని కూడా తెలియని అజ్ఞానంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వారికి అధికారాన్ని కట్టబెడితే దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని బహిరంగంగానే ప్రజలు మండిపడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేతల హామీల వైఖరి హైదరబాద్ కు సముద్రాన్ని తీసుకొచ్చేలా ఉన్నాయాని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు రాజకీయవాదులు.
Also Read:దీపావళి హారతులు ఎందుకు ఇవ్వాలి?