Congress:ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెనుక వ్యూహామదే?

44
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వ్యూహాలకు పడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా దళితులను ఆకర్శించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చూస్తే దళిత గిరిజన ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ వ్యూహాలేంటో స్పష్టంగా అర్థమౌతాయి. పది పాసైన దళిత గిరిజన విద్యార్థులకు 10 వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే 25 వేలు, ఇక పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయల నగదు ఇస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. .

అలాగే పదిహేను లక్షల రూపాయలతో దళిత బంధు ఇస్తామని చెబుతోంది. ఇంకా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, అంబేద్కర్ అభయ హస్తం, ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం.. ఇలా దాదాపు 12 అంశాలను ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రస్తావించింది. అయితే ప్రస్తుతం దళిత గిరిజనలు పట్ల బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా అంశాలనే కాంగ్రెస్ ప్రస్తావించింది. ఇక మొదటి నుంచి కూడా దళితుల్లోనూ, గిరిజనుల్లోనూ బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేని ఆధారణ ఉంది. దీంతో దళితులను బి‌ఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం అంతా తేలికైన విషయం కాదు. ఈ విషయం హస్తం నేతలకు తెలియనిది కాదు అందుకే దళిత గిరిజనులపై ప్రేమ ఒకకబోస్తూ ఇకంగా 12 హామీలను డిక్లరేషన్ లో ప్రకటించింది. అయితే ఈ హామీలను ఎస్సీ, ఎస్టీ లు అంతా తేలికగా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రస్తుతం దళిత గిరిజనులకు కే‌సి‌ఆర్ సర్కార్ మెరుగైన సాధుపాయాలను అందిస్తూ, అమలౌతున్న పథకాలకు ప్రజల్లో మంచి ఆధారణ ఉంది. మరి బి‌ఆర్‌ఎస్ నుంచి ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హస్తం నేతలు పన్నుతున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు

- Advertisement -