కాంగ్రెస్ ది అధికారమా.. అహంకారమా?

17
- Advertisement -

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం విమర్శించడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో మాత్రం ఈ వ్యవహారం రివర్స్ లో సాగుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా గెలుపొందిన కాంగ్రెస్.. ఆ గెలుపును ఆ పార్టీ నేతలు సైతం నమ్మలేని విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. అయితే అధికారం చేతిలో ఉన్నప్పటికి కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. బి‌ఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించడం బి‌ఆర్‌ఎస్ నేతలపై బురద చల్లడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి చూస్తే నిజంగా వీరు ప్రభుత్వ పాలకులేనా అనే సందేహాలు రాక మానవు. తాజాగా బి‌ఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి స్వయంగా సి‌ఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉన్న పదవి హోదాను తగ్గించే విధంగా ఉన్నాయని రాజకీయ వాదులు అభిప్రాయ పడుతున్నారు.

బి‌ఆర్‌ఎస్ ను 100 మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యాలు ఎన్నికల టైమ్ లో చూస్తుంటాము కానీ అధికారంలోకి వచ్చాక కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బి‌ఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి ” తాము తలచుకుంటే బి‌ఆర్‌ఎస్ పార్టీని ముక్కలు చేస్తామని ” వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పాలకులనే సంగతి మర్చిపోయారా అనే సందేహాలు రాకమానవు. సాధారణంగా ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అందువల్ల ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు ఆచితూచి జవాబు ఇవ్వాల్సిన ప్రభుత్వ నేతలు.. ప్రశ్నిస్తే పాతేస్తాం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే వైఖరితో పాలన సాగిస్తే కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం లేకపోలేదు.

Also Read:మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్

- Advertisement -