Congress:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి,వెంకట్!

75
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. తెరపై పలువురు సీనియర్ల పేరు వినపడినా ఎవరూ ఊహించని విధంగా బల్మూరు వెంకట్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్ పేరు తొలి నుండి ప్రచారం జరుగగా బల్మూరి వెంకట్ పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారు కాగా సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

రెండు స్థానాలకు గాను నాలుగు నుంచి ఐదుగురి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది. నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ పేరు దాదాపు ఖరారుకాగా మిగిలిన స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నేతల పేర్లు వినపడ్డాయి.

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉండగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇచ్చే అవకాశం ఉండగా… ఒకటి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ రానుంది.

Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

- Advertisement -