- Advertisement -
మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు భేటీ అయ్యారు.
వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.
- Advertisement -