జగ్గారెడ్డి, వీహెచ్‌కు షాక్‌!

70
revanthqj
- Advertisement -

పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకివ్వనున్నట్లు సమాచారం. జగ్గారెడ్డితో పాటు వీహెచ్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మీడియా ముందుకు వచ్చి పార్టీ నేతల గురించి ఎవరు మాట్లాడవద్దని రాహుల్ సూచించిన జగ్గారెడ్డి లైన్ దాటడంతో సీనియర్ నేతలు ఈ వ్యవహారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జితో పాటు పొలిటికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్‌ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు పార్టీకి సమాచారం లేకుండా యశ్వంత్‌సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్‌ఎస్‌తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్‌ నోటీసులివ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై ఇవాళ జగ్గారెడ్డి సైతం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

- Advertisement -