స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!

69
- Advertisement -

ఎన్నికల వేళ సర్వేలు తెరపైకి రావడం సహజం. ప్రజానాడి ని అంచనా వేస్తూ కొన్ని సర్వేలు అధికారంలోకి వచ్చే పార్టీని ముందే అంచనా వేస్తుంటాయి. ఆ సర్వేలను బట్టి అధికారం ఎవరిదనే దానిపై ఓ అంచనాకు వస్తుంటారు ప్రజలు.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏది వాస్తవం ఏదీ అవాస్తవం అనేది గుర్తించడం కష్టతరంగా మారింది. ఫెక్ సర్వేలు సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఓటమి భయంతో కాంగ్రెస్ సృష్టిస్తున్న ఫెక్ సర్వేల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తెలంగాణలో ఏదో అయిపోతుందని, అధికారంలోకి వచ్చేది తామేనని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఆసక్తికర విషయమేమిటంటే.. ఆ పార్టీ చేయించిన అంతర్గత సర్వేలో కూడా పార్టీకి ప్రతికూల ఫలితలే వచ్చినట్లు సమాచారం. అందుకే ఆ పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీ నే అధికారంలోకి రాబోతుందని, 70 సీట్లకు పైగా సాధించబోతుందని ఫెక్ సర్వేలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు ఆధిక్యాన్ని కట్టబెట్టిన సర్వే సంస్థలేవీ కూడా ఆ విషయాన్ని దృవీకరించలేదు. అవన్నీ ఫెక్ అని తమ సంస్థల పేర్లతో కాంగ్రెస్ మోసం చేస్తోందని తేల్చి చెబుతున్నాయి. అవన్నీ నమ్మో దంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ డమ్మీ సర్వేల బాగోతం బయట పడింది. దీంతో కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అని ఆ పార్టీ మరోసారి నిరూపించుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:చామదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో..!

https://x.com/GoudNareshBrs/status/1729407249595187515?s=20

- Advertisement -