గత పదేళ్ల కాలంలో ప్రజలకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు లేకుండా సుపరిపాలన అందించిన కేసిఆర్ సర్కార్ దిగిపోయిన తరువాత ప్రజలకు దిన దినం గండంగానే మారింది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కల్లబొల్లి కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తల తోక లేని పాలన చేస్తూ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలోనే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి. నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేసిఆర్ హయంలో ఏడాదికి రెండు పంటలు తీసిన రైతులు ఇప్పుడు ఒక్క పంట పండించుకోవడానికే నానా ఆపసోపాలు పడుతున్నారు.గత ఏడాది శివరాత్రి సమయంలో నిండు కుండలా ఉన్న గోదావరి.. నేడు చుక్క నీరు లేక బోసిపోయింది. ఆరు గ్యారెంటీల అమలునే ఎజెండాగా పెట్టుకొని.. మిగతవేవీ పట్టనట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరిలో నీటి జాడ లేక వెలవెలబోతుంది. దీంతో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలు ఆగం ఆగం అవుతున్న పరిస్థితి. పోనీ ఇచ్చిన హామీల విషయంలోనైనా కాంగ్రెస్ నిబద్దతతో ఉందా అంటే అదీలేదు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెబుతూ.. ఆయా హామీల విషయంలో పెడుతున్న షరతులు, పరిమితులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కేసిఆర్ హయంలో ఎలాంటి అవరోదలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించారు. కానీ రేవంత్ రెడ్డి సిఎం పదవి చేపట్టిన తరువాత కేసిఆర్ హయంలో ఉన్న హామీలకు బ్రేకులు పడడంతో పాటు కొత్తవి కూడా సవ్యంగా ప్రజలకు అందని పరిస్థితి. మొత్తానికి పాలన విధానంలో కేవలం రెండు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది కాంగ్రెస్. మరి ముందు రోజుల్లో పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పెను సంక్షోభం తలెత్తే అవకాశం లేకపోలేదు.
https://x.com/BRSparty/status/