Revanth:వంద రోజులు.. వంద ప్రశ్నలు !

29
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో హస్తం నేతల పాలన ఎలా ఉంది ?. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలూ నెలకొన్నాయి. ఇచ్చిన హామీలను ఈ వంద రోజుల్లో ఎంతవరకు అమలు చేశారు ? అనే ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వంద రోజుల పాలనపై బి‌ఆర్‌ఎస్ పార్టీ వంద ప్రశ్నలను సంధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పదేళ్ళలో లేని కష్టాలు రాష్ట్ర ప్రజలకు మొదలయ్యాయని, కరెంటు కోతలు, నీటి కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించింది. .

కానీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన ఇంతవరకు దాని ఊసే లేదు. ఇంకా రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమల్లోకి తీసుకొస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ రైతు భరోసా ఇవ్వడం సంగతి అటుంచితే రైతు బంధు పథకాన్ని కూడా నిలిపివేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళలకు ప్రతి నెల రూ.2500, పెన్షన్ రూ.4 వేలకు పెంపు వంటి హామీల ప్రస్తావనే మరించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవి మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రకటించి మరచిన హామీలను వంద ప్రశ్నలుగా బి‌ఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ లో ప్రస్తావించింది.

ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ వేసిన వంద ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఆరు గ్యారెంటీల పేరుతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీల విషయంలో ఈ వంద రోజుల్లోనే ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే దానిపై బి‌ఆర్‌ఎస్ పార్టీ తరచూ ప్రశ్నిస్తూనే ఉంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వంద ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం ఇస్తారా లేదా అనేది చూడాలి.

Also Read:పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

- Advertisement -