రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మేము సైతం అంటున్నారు జిల్లాల కలెక్టర్లు. ఇప్పటికే చాలా మంది కలెక్టర్లు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యారు. నాయక్ బలరాం ఐ ఆర్ ఎస్ డైరెక్టర్ సింగరేణి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు సంగారెడ్డి జిల్లా కలెక్టరర్ ఎం హనుమంతరావు.
అనంతరం మరో ముగ్గురు కలెక్టర్లు జనగామ కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి , జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఈ గ్రీన్ ఛాలెంజ్ లో జిల్లా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలపడంతో ఎంపీ సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
Thank you @Collector_SRD garu for accepting #GreenIndiaChallenge . https://t.co/xnXb45p9oA
— Santosh Kumar J (@MPsantoshtrs) November 5, 2019