శిబుసోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ…

63
jharkhand
- Advertisement -

జార్ఖండ్ పర్యటనలో భాగంగా జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) నేత శిబు సోరెన్‌తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్సీ కవిత,ఎంపీ సంతోష్ కుమార్‌, వినోద్ కుమార్‌ ఉన్నారు.

గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు. అండ‌గా ఉంటామ‌ని కేసీఆర్ భ‌రోసానిచ్చారు.

చైనా సైనికులు భారత్‌లోని గల్వాన్‌లోయపై పట్టు సాధించడానికి మన సైనికులతో రెండేండ్ల క్రితం ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో సంతోష్‌కుమార్‌తో పాటు 19 మంది సైనికులు చనిపోయారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పారు.

- Advertisement -