ఫొని తుఫాను కారణంగా ఒడిశా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. పోని తుఫాన్ కారణంగా ఒడిశాలో 35 మంది మృతి చెందగా భారీ సంఖ్యలో వృక్షాలు,విద్యుత్ స్తంభాలు,టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒడిశాలో లక్షల సంఖ్యలో విద్యుత్ స్తంభాలను మార్చాల్సి ఉండటంతో ప్రజలు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తమకు సహకారం అందించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన విజ్ఞప్తికి స్పందించారు సీఎం కేసీఆర్. సీఎస్ జోషి, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో మాట్లాడి ఒడిశాకు సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో వెయ్యిమంది ఉద్యోగులు ఒడిశాకు తరలివెళ్లారు. మరమ్మత్తు చర్యల్లో పాల్గొంటున్నారు.
సీఎం కేసీఆర్ అందించిన సాయానికి ప్రజలు ఫిదా అయ్యారు. మరోవైపు భువనేశ్వర్, పూరీ జిల్లాలో పరిహార పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీదీ విద్యుత్ సరఫరాపైనే ఆధారపడి ఉండటంతో తొలుత విద్యుత్ పునరుద్దరణపై దృష్టిసారించారు ఆ రాష్ట్ర సీఎం.