లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ సొత్తు

31
- Advertisement -

బీఆర్‌ఎస్ ఏర్పాటు బీజేపీ పతనం అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం ఆరవింద్ కేజ్రీవాల్‌ పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌ కేరళ సీఎం పినరయి విజయన్ సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… భవిష్యత్‌ కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు.

బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ గుబులు పుట్టిందన్నారు. భవిష్యత్‌ భారతాన్ని తిర్చి దిద్దడానికి కదం తొక్కే సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఇంతమంది దేశ నాయకులు పాల్గొన్నారు అని అన్నారు. గెలుపు ఓటములు సహజం. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి…ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి..ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్‌ అన్నారు.

భారత దేశం భూభాగం 83 కోట్ల ఎకరాలు.. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు అంటే సగం భూమి వ్యవసాయానికి అనుకూలం. అపారమైన జల సంపద లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుంది. 70 వేల టీఎంసీలు ఆవిరైతే.. మనం ఉపయోగించుకునే నీరు 70-75వేల టీఎంసీల నీరు. భూమి ఉంది.. నీరు ఉంది.. పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి అద్భుతంగా కలిగి ఉన్న దేశం మనది అని అన్నారు.

ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్‌ చైన్‌ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి దానికి కనెక్టెడ్‌గా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలు పెట్టి.. అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్‌ ఫుడ్‌ చైన్‌ ఆఫ్‌ వరల్డ్‌ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుటుంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకేమైనా ఉంటదా? లక్ష కోట్ల రూపాయల విలువైన ఫామాయిల్‌ను దిగుమతి చేసుకుందమా.. ఇంతకన్న సిగ్గు చేటు ఉందా అని కేసీఆర్‌ అన్నారు. భారత్‌లో యాపిల్‌ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలో 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్‌ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్‌ బర్గార్లా మనం తినేవి ?

ప్రశ్నించడంతోనే ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. బీఆర్‌ఎస్‌లాంటి భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్‌ను వెలుగుజిలుగుల దేశంగా తయారు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఖమ్మం సభలో కేంద్రం అవలంభిస్తున్న విధానాలను తూర్పారబాట్టారు. రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలను పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు.

రష్యాలో అంగారా నదిపై 5968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఘనాలో 5085 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. కెనడాలో 4944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్ట్‌లో నైలునదిపై 4500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. పొరుగు దేశం చైనాలో యాంగ్జీ నదిపై 1400 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. అమెరికాలోని కొలరాడోలో 1200 టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన దేశంలో అటువంటి ప్రాజెక్ట్‌లు లేవని మండిపడ్డారు. సరైన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకు వచ్చి ప్రజల, పొలాల దాహం తీర్చాలా. సన్నాసుల్లా ఇట్లనే ఉండాలా? అని కోరుతున్న. ఇది ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికి పుట్టిందే బీఆర్‌ఎస్‌.

దేశంలోని రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటుదన్నారు. రాష్ట్రాల మధ్య నీటి వాటాలను తేల్చేందుకు బీజేపీ వెనుకడుగు వేస్తున్నారు. చేతగాక పరిపాలన చేయరాక, చట్ట స్ఫూర్తి తేక.. సహజంగా, అప్పు అవసరం లేని బ్రహ్మాండంగా సహజ సంపదను వినియోగించే తెలివి లేక, డొల్ల మాటలు చెప్పే పరిపాలకులు కావాలా? పొద్దుపుచ్చే పరిపాలకులు కావాలా? నిజాయితీగా పనిచేసే వారు కావాలా…అని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు రెండే. కాంగ్రెస్‌ ఉంటే బీజేపీ, బీజేపీ ఉంటే కాంగ్రెస్‌ను తిట్టడం. ఈ తిట్ల పురాణమా కావాల్సింది? మన గొంతులు తడవాలా? పొలాలు పండాలా? దయచేసి ఆలోచించాలన్నారు.

ఉచితాలు అని పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానిస్తున్నారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సిగ్గుపడాలి. దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4లక్షల మెగావాట్లు ఉత్పత్తి ఉంది. కానీ ఈ దేశం ఎన్నడూ 2.10లక్షల మెగావాట్లకు మించి వాడలే. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వమంటే దానిపై 96కథలు. దోపిడీదారులు అన్నట్లు, రేవ్‌డీ కల్చర్‌ అని అన్నారు. దేశమంతా తెలంగాణలో ఇస్తున్నట్లుగా ఉచిత కరెంటు ఇవ్వాలి. దీనికయ్యే ఖర్చు లక్షా45వేలకోట్లు మాత్రమే. రేపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ ప్రతిపాదించే ప్రభుత్వం వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మోడల్‌ మాదిగా దేశమంతా ఉచిత విద్యుత్‌ అందిస్తాం. తెలంగాణ రైతుబంధు లాంటి స్కీమ్‌ భారతదేశమంతా అమలు చేయాలనేదే బీఆర్‌ఎస్‌ నినాదం, డిమాండ్‌’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి…

ఖమ్మం జిల్లాకు వరాల్లు:సీఎం

బీజేపీని గద్దే దించడమే మా లక్ష్యం…

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా…

- Advertisement -