తెలంగాణలోని ఫలాలు మరేక్కడ లేవు : సీఎం కేసీఆర్‌

68
kcr
- Advertisement -

దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రజలు వాటి ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు సీఎం కేసీఆర్‌. వికారాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ప్రజలకందించే సంక్షేమ ఫలాలు ఏవిధంగా ప్రజలు లబ్ది పోందుతున్నారో వివరించారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామని ఇప్పటికే హామీనిచ్చిన సంగతి గుర్తు చేశారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. జిల్లా టీఆర్ఎస్‌ కార్యాలయంను ప్రారంభించారు. రూ.60.70కోట్లు వెచ్చించి కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీపై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు.

వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 ఠంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశమన్నారు.

రాష్ట్రంలో కరెంటు బాధలు పోయాయి. గతంలో కరెంటు ఎప్పుడొస్తదో? ఎప్పుడు రాదో? ఎన్ని మోటార్లు కాల్తయో? ఏసిన పంట పండుతదో లేదో తెల్వదు. కానీ ఈనాడు వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలూ అత్యుత్తమ విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సంక్షేమం చేసుకుంటున్నం. దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నాం. ఆడపిల్లల పెళ్లికి కులమతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నాం. ఆస్పత్రులలో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కేసీఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసు. ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్నారు.

తెలంగాణలో అందే ఫలాలు దేశంలో మరెక్కడా లేవని గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారు. తాండూరు వెళ్తూ ఉండే వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. గతంలో రైతులు నీళ్లు, కరెంటు లేక.. హైదరాబాద్ వచ్చి కూలీలుగా, ఆటోరిక్షావాలాలుగా పనిచేసేవారు.

పల్లె ప్రగతి కార్యక్రమాలతో రైతాంగం అంతా ధీమాగా ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి తీసుకుంటున్న ఒకే ఒక రైతు ఇండియాలో తెలంగాణ రైతు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నమన్నారు. గతంలో ఉన్న నీటి బకాయిలు కూడా రద్దు చేశాం.

గతంలో రైతులు ప్రమాదాల్లో చనిపోతే ఆపద్భందు అని చెప్పి రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. అది కూడా ఆరేడు నెలలపాటు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగితే.. ఏ పదివేలో ఇచ్చి మిగతావి మేసేవాళ్లు మేసి మిగతావి రైతులకు ఇచ్చేవారు. పల్లె సీమలు పచ్చదనంతో కళకళలాడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, పల్లెల్లో ఉన్న వారందరికీ పనులు దొరకాలనే ఆలోచనతో ప్రభుత్వం నేడు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పది రోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా.. నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయి. అని పేర్కొన్నారు.

- Advertisement -