తెలంగాణ గౌరవాన్ని నాటి నేటి వరకు నలూదిశలా విస్తరించేలా చేసిన భువనగిరి పాలకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…. వీరత్వానికి పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆగస్టు 18న ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను పాపన్న జయంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. పాపన్నకు మొఘలలు సైతం భయపడిపోయేవారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పోరాడిన పాపన్న తెగువ, తీరు గొప్పదని సీఎం అన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.