భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సాధిస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ద పాలనకు అంకురార్పణ జరిగిన రోజు పౌరులందరికీ నిజమైన పండుగ అని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు స్మరించుకొనే రోజు అని అన్నారు. గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు సంప్రదాయాలు భాషలు ఆచారాలతో కలగలిపిన భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశ ప్రధాన లక్షణం అని కేసీఆర్ అన్నారు.
దేశంలో సమాఖ్య స్పూర్తి వికసించి ప్రగతి పథంలో పయనిస్తామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోని ఆచరించాలి అని సూచించారు. ఆశయాల సాధనకు మరింత కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి…