శ్రీశ్రీ స్వరూపనందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

274
kcr Met Swarupanandendra Swamy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిల్మ్ నగర్లోని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపనందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి వెళ్ళి శారద పీఠాధిపతిని కలిశారు.గతంలో విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన సీఎం… ఆ క్రమంలో ఇవాళ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు.

సీఎం కేసీఆర్, స్వరూపనందేంద్ర స్వామి ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈసందర్భంగా పలు రాజకీయ అంశాలను కూడా చర్చించి నట్టు తెలుస్తుంది. జూన్ మాసంలో జరిగే పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు స్వరూపనందేంద్ర స్వామి. జూన్ 15 నుంచి 18 వరకూ మూడురోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి బాధ్యత స్వీకరణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

- Advertisement -