మునుగోడు ఉప ఎన్నికలపై వికాస్‌రాజ్‌ రివ్యూ మీటింగ్‌

340
- Advertisement -

తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసందర్భంగా తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ వికాస్‌రాజ్‌ అధికారులతో రివ్యూ మీటింగ్‌ జరిపారు.

చండూర్ మండల పరిషత్ కార్యాలయంలో సీఈసీ ఎన్నికల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా, డబ్బు, మద్యం పంపిణి జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్నారు. ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 మునుగోడు ఉపఎన్నికకు 3300 మంది పోలీసులు, 128 మంది ఎక్సయిజ్ టీంలు, 14 వీడియో అబ్సర్వర్లు, 9ఆడిషనల్ టీం లు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయని అన్నారు.

ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్..జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి, ఎన్నికల జనరల్ అబ్సర్వర్, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -