తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

12
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణ బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు.

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగా..సన్నవడ్ల కు 500 బోనస్ కి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.రేపటి నుండి ప్రతి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వచ్చే సీజన్ నుండి సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు.ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు పొంగులేటి. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, లూజ్ విత్తనాలను రైతులు కొనవద్దన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్ల నిర్వహణ చేపడతామన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.రైతులు అధైర్య పడొద్దు..మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు పొంఉలేటి.కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ సూచించిన విధంగా ముందుకు వెళ్తామన్నారు.

Also Read:అమెరికాలో తెలుగు మహిళ అరుదైన ఘనత

- Advertisement -