రాష్ట్ర కేబినెట్ భేటీ …

260
Telangana cabinet meeting today
- Advertisement -

శాఖల వారిగా బడ్జెట్ కేటాయింపులే ఎజెండాగా తెలంగాణ కేబినెట్  సమావేశం ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలతో పాటు, రానున్నబడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా మంత్రులు సమీక్ష చేయనున్నారు.

గత బడ్జెట్‌ లాగానే ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఈసారి ఉండవు. రెవెన్యూ… క్యాపిటల్ పద్దులు మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రణాళికలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల తీరుపై చర్చించనుంది మంత్రివర్గం. వచ్చే ఎఫ్రిల్ నుంచి 2 లక్షల మంది ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయల పెన్షన్ వంటి కార్యక్రమాలపై డిస్కస్ చేయనుంది కేబినెట్. దీంతో పాటు రెసిడెన్సియల్ స్కూళ్లు, పోస్టుల భర్తి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిషన్ భగీరథ పథకాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇక రిజర్వేషన్ల పెంపుపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీల సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టీస్ చెల్లప్ప కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సివుంది. అటు మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై నియమించిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి సుధీర్ కమిటీ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై కూడా కెబినెట్ లో చర్చ జరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -