ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో 2 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ భేటీలు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 15న ఒకే రోజు మూడు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు మిషన్ భగీరథ, కంటికి వెలుగు, రైతుబీమా పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ మూడు పథకాలకు ఒకే ముహూర్తం కావడంతో దీనిపై సీఎం సూచనలు చేయనున్నట్లు సమాచారం
దీంతో కొత్తగా చేపట్టనున్న 9200 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ మార్గదర్శకాలు, లక్ష ఉద్యోగాల హామీలో ఇప్పటి వరకు జరిపిన నియామకాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. హరితహారం, రైతు బీమా, ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట వరకు మెట్రో రైల్ ప్రారంభంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆగస్టు 1తో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోతుంది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నది.