- Advertisement -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇక అదే రోజు సాయంత్రం టీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 3న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరుగనుండగా ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.
- Advertisement -