- Advertisement -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన అక్టోబర్ 1న కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. నూతన రెవెన్యూచట్టంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు.
- Advertisement -