- Advertisement -
ఈ నెల 28న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు లైన్‌క్లియర్ కావడంతో దానిపైనా చర్చించే అవకాశముంది. ఉద్యోగులకు డీఏ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు, ఖైదీలకు క్షమాభిక్ష, కొత్త పోస్టుల మంజూరు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ రెండు రోజుల పాటు జరగడం ఇదే తొలిసారి కానుంది.
- Advertisement -