సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..

31
- Advertisement -

తెలంగాణ సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా 20 కి పైగా అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ఫైల్స్ తో సహా మొత్తం 20 కి పైగా అంశాలు ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, అమరవీరుల స్మారక జ్యోతి ప్రారంభ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.

Also Read:జగన్ ను ప్రజలు నమ్ముతారా ?

రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 50 వేల మంది ఆదివాసీలు, గిరిజనులకు సుమారు 4 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాలు పంచే కార్యక్రమ తేదీని ఫైనల్ చేసే అవకాశం ఉంది. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.

- Advertisement -