కాళేశ్వరం,మున్సిపల్‌ ఎన్నికలపై సీఎం రివ్యూ..

386
cm kcr
- Advertisement -

ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై దృష్టిసారించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సచివాలయం,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఈ నెల 18 మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరగనుంది.

ఇక తెలంగాణ కరువు గోసను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అదిరిపోయేలా,టీఆర్ఎస్ తరపున సంబురాలు ఘనంగా నిర్వహించాలని యోచిస్తున్నారు గులాబీ బాస్. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో జరపనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతోపాటు పార్లమెంటు, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరపనున్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారని తెలిసింది.

మరోవైపు పార్లమెంటు ఫలితాలను విశ్లేషిస్తూ, స్థానిక సంస్థల విజయానికి ఎలా బాటలు పడింది? పురపాలక ఎన్నికలకు వ్యూహం తదితర అంశాలను సీఎం వివరించనున్నట్లు తెలిసింది.

- Advertisement -