12న తెలంగాణ కేబినెట్ భేటీ…

367
cm kcr
- Advertisement -

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 17న జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

కొత్త మున్సిపాలిటీ చట్టంపై కేబినెట్‌లో చర్చించి అమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనుంది.

- Advertisement -