- Advertisement -
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రం ఖజానాకు నిధులు సమకూర్చుకోవడం, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇవ్వనున్న రూ. 10లక్షల పింఛన్లకు సంబంధించి, దళిత బంధు పథకం రెండో విడత అమలుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖలో అడ్ హక్ సీనియారిటీ రూల్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
జాతీయ రాజకీయాలపైన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలపై కేబినెట్ మీటింగ్ లో మంత్రులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -