తెరపైకి కేబినెట్ విస్తరణ..ఆ 6గురు ఎవరు?

26
- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానుండగా అనంతరం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో పాటు 12 మంది మంత్రులు ఉండగా మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవి ఆరు స్థానాలే కానీ ఆశావాహుల సంఖ్య చాంతాడంత ఉంది. దీంతో ఆ అరుగురు అదృష్టవంతులు ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరుగతోంది.

సామాజికవర్గ సమీకరణలను పరిశీలిస్తే ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మున్నూరు కాపు, కురుమ సామాజికవర్గాలకు చోటు ఇవ్వాలని భావిస్తే ఆది శ్రీనివాస్ లేదా బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ . లేదా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది . ఇక కేబినెట్‌లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని ప్రచారం జరుగుతోండగా దీనికి అధిష్టానం ఓకే చెప్పిన వెంటనే అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -