మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం!

2
- Advertisement -

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కేబినెట్ విస్తరణపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా రూమర్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. వాస్తవానికి డిసెంబరు ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం.. అధిష్ఠానంతో చర్చలు.. విస్తరణ ఉంటుందని అంతా భావించారు.

కానీ తీరా చూస్తే మంత్రివర్గ విస్తరణ కేవలం వార్తలకే పరిమితమైంది. అయితే తాజా పరిణామాలను బట్టి మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం.. ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్ళటంతో ఆలస్యం కానుంది.

అలాగే ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read:యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’

 

- Advertisement -