కొత్తగా కొలువుదీరిన మంత్రులు.. వారి శాఖలు..

212
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొదట నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Telangana cabinet

ఈ నేపథ్యంలో మంత్రులకు కేటాయించే శాఖలను ఖరారు చేశారు సీఎం కేసీఆర్‌.

1. ఈటల రాజేందర్- వైద్యాఆరోగ్యం
2. వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
3. గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ
4. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ
5. తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ
6. కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ
7. ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
8. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం,
9. వి. శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్- పర్యాటకం, క్రీడలు
10. చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి

- Advertisement -