మంత్రివర్గ విస్తరణ..ముగ్గురికి చోటు!

3
- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోండగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెడ్డి,ఎస్సీ, ఎస్టీ లేదా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆశావాహుల జాబితా చాంతాడంతా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కని వారి నుండి నిరసన రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవలె సీఎం రేవంత్ రెడ్డి… మంత్రులకు డిన్నర్ ఇచ్చినప్పుడే కేబినెట్ విస్తరణపై ప్రచారం జోరందుకుంది. అయితే ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. కానీ తాజాగా మరోసారి ఊహాగానాలు రాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:నాగ్..’కుబేర’ ముగించేశాడు!

- Advertisement -