మంత్రివర్గ విస్తరణ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు మరో ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక జారీ చేశారు.
మంత్రివర్గ విస్తరణ చేయడం లేదంటూ పలువురు నాయకులు తమకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి బాహాటంగానే విమర్శలు చేస్తుండగా ఆ లిస్టులో తాజాగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరారు.
ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఇచ్చామని, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టామని.. తీరా మంత్రి పదవి వచ్చే సమయానికి అడ్డుపడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి, రెడ్డి నాయకులను దూషిస్తూ లేఖ రాశారు వాకిటి శ్రీహరి అభిమానులు, ముదిరాజ్ సంఘం నాయకులు.
Also Read:ఓటీటీలోకి రాబిన్ హుడ్!
బిడ్డా రేవంత్ రెడ్డి, మా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి మంత్రి పదవి రాకుండా చేస్తే నీ భరతం పడతామని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


