తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌ను కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 19న మంత్రివర్గానికి విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్‌కు తెలిపారు. అదే రోజున రాజ్ భవన్‌లో మంత్రివర్గం ప్రమాణస్వీకారాన్ని చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కాగా, ఈసారి కేబినెట్‌లో 10 మంది మంత్రులకు చోటు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎక్కువమంది కొత్తవారికే అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాల వారిగా సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని తెలుస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కబోయే 10 మంది అదృష్టవంతులు వీళ్లే..
కడియం శ్రీహరి,ఈటెల రాజేందర్,జగదీశ్వర్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు,సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి,కొప్పుల ఈశ్వర్,వేముల ప్రశాంత్ రెడ్డి,పద్మాదేవేందర్ రెడ్డి..ఈ సారి కేటీఆర్, హరీష్‌రావులకు చోటు దక్కుతుందా లేదా మరో చోటు దక్కుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావల్సివుంది.