తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈనెల 9వ తేదిన సీఎం కేసీఆర్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2019-20) పూర్దిస్ధాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నాలుగు రోజుల సెలవు అనంతరం ఈరోజు ఉదయం 10గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన అనంతరం బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది.
ఈ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రులు చెరుకు ముత్యంరెడ్డి, ముఖేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సోమగోపాల్‌కు సభ సంతాపం తెలుపనున్నది.
ఆశ్రమ పాఠశాలలు, ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీహెచ్‌ఎంసీలో మురుగునీటి శుద్ధికేంద్రాల సామ ర్థ్యం పెంపు, సంచార పశువైద్యశాలలు, హైదరాబాద్‌లో ఐదురూపాయల భోజనకేంద్రాల పెంపు, గొర్రె పాకల మంజూరు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం, వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపు, కల్యాణలక్ష్మి పథకాలపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది.