9 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!

566
cm kcr budget
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 9 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు శాసనభ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ముగుస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది టీఆర్ఎస్ సర్కార్‌.

సమావేశం మొదటి రోజే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్‌లో రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు అధిక మొత్తంలో కేటాయించే అవకాశం ఉంది.

ఆర్థిక మాంద్యం పొంచిఉన్న నేపధ్యంలో పద్దులు పొదుపుగా రూపొందించాలని సీఎం సూచనలతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి కొత్త రెవెన్యూ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -