వరుసగా ఐదోసారి బడ్జెట్ పెట్టే అవకాశం రావడం ఎంతోసంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఈటెల బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు.
వినూత్నమైన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని గాడిలోకి తెచ్చామన్నారు. చీకటి నుంచి వెలుగులోకి,వలస బతుకుల నుంచి వెలుగుల వైపు తెలంగాణను నడిపించామన్నారు.
తెలంగాణ జీడీపీ మెరుగుపడిందని తెలిపారు. రాష్ట్ర జీడీపీ ఏటేటా పెరుగుతోందని 2017-18..ప్రస్తుతం 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.నూతన పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వెల్లువలా వచ్చాయని తెలిపారు. స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతిని సాధించామన్నారు. ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వం తీసుకోచ్చిన ప్రణాళికలతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయం కీలకమన్నారు.ఓ వైపు ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూనే మరోవైపు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించామన్నారు.