రైతు సంక్షేమానికి పెద్దపీట..

244
Telangana budget 2018
- Advertisement -

రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశామన్నారు ఈటెల. వందశాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తైందని..త్వరలోనే ధరణి వెబ్ సైట్ ద్వారా వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

రైతులకు ప్రభుత్వానికి వారధిగా రైతు సమన్వయ సమితులు నిలవనున్నాయని తెలిపారు. రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8వేల పెట్టుబడి ఇవ్వనున్నామని చెప్పారు.

రైతులకు భరోసా ఇచ్చేందుకు భీమా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం రూ.5లక్షల భీమాను అందిస్తామన్నారు. 50 శాతం నుంచి 90 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు,సేద్య పరికారలను పంపిణీ చేశామన్నారు.

రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం జరుగుతోందని మరో 29 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చిన్న,సన్నకారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. రైతుల పెట్టుబడి కోసం రూ.12వేల కోట్లు కేటాయించామన్నారు.

- Advertisement -