Telangana:నేటి నుండి బూస్టర్ డోస్

42
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోస్ విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. నేటి నుండి మళ్లీ బూస్టర్ డోస్ పంపిణీ చేయనుంది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో బూస్టర్ డోస్ టీకాలు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. మొత్తం 5 లక్షల బూస్టర్ డోస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చని వెల్లడించారు.

Also Read:పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నది. గత నెల రెండో వారం నుంచే రాష్ట్రానికి కొవిడ్‌ టీకాలు పంపడం ఆపేసింది.కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకోలుదు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బయోలాజికల్‌-ఈ సంస్థ నుంచి 15 లక్షల డోసుల కార్బెవ్యాక్స్‌ టీకాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుండి బూస్టర్ డోస్‌లను పంపిణీ చేయనున్నారు.

Also Read:కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

- Advertisement -